![]() |
![]() |
.webp)
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి గుండె నిండా గుడి గంటలు సీరియల్ టీమ్ వచ్చింది. ఇక ఇందులో మీనా రోల్ తరువాత అంత ఇంపాక్ట్ చూపించిన రోల్ ప్రభావతిది . ఇక శ్రీముఖి ఆమెను ఒక ప్రశ్న అడిగింది . ఒక పక్కన తమిళ్ లోను, తెలుగు లోను సేమ్ రోల్ చేస్తున్నారు ఏ బాగుంది అంది. దాంతో ఆమె షాకైపోయిది. ఏ కన్ను గొప్పది అని అడిగితే ఎం చెప్పాలి అంటూ ఆమె అడిగింది .
తర్వాత శ్రీముఖి తన క్యూట్ గై కోసం వెతుకుతూ ఉంది. అతను ఎవరో కాదు బాలు. ఈ సీరియల్ లో మెయిన్ లీడ్. మీనాకి జోడీగా బాలు చేస్తున్నాడు. ఐతే బాలు అంటే శ్రీముఖికి స్క్రీన్ పరంగా చాల ఇష్టం. ఎప్పుడు బాలు ఈ షోకి వచ్చినా ఆటపట్టిస్తూ సరదాగా సరసాలాడుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు కూడా ఈ సీరియల్ టీమ్ అంతా ఒక సారి వస్తే మీనా బాలు తర్వాత స్పెషల్ గా వచ్చారు. "నేను ఎదురు చూస్తున్న ఆ వీరుడు సురుడు ఎక్కడ అని అడిగింది.
ఇంతలో మీనా - బాలు జోడి చాలా గ్రాండ్ లుక్ లో స్టేజి మీద చేయి చేయి పట్టుకుని అడుగుపెట్టారు. పుష్ప మూవీలో సూసేకి అగ్గిరవ్వ మాదిరి అనే సాంగ్ కి డాన్స్ చేస్తూ వచ్చారు. "బాలుని మీనాను మీరెప్పుడూ ప్రేమగా ఉండడమే చూసారు కానీ ఒక్కసారి చేంజ్ కోసం ఒకరి పట్ల ఒకరు పోటీ పడితే ఎలా ఉంటది "అని శ్రీముఖి చెప్పేలోపు ఏదో కొట్టుకునే వాళ్ళలా ముందు బిల్డప్ ఇచ్చారు కానీ తర్వాత మీనా వెళ్లి రోజా పువ్వు ఇచ్చింది. దాంతో శ్రీముఖికి మండిపోయింది. మనం ఎంత పోటీ పడమన్నా వాళ్లేంటి ప్రేమించుకుంటున్నారు అంటూ హరి శ్రీముఖిని మరింత రెచ్చగొట్టాడు.
దాంతో శ్రీముఖి ఫైనల్ చేసుకోవాలని కంకణం కట్టుకుంది. "బాలు తేల్చేసేయ్ ఈరోజు నీకు మీనా - నేనా " అని అడిగింది. "ఇప్పటివరకు మీ అందరికీ తెలుసు మీ అందరికీ ఇష్టం " అని చెప్పబోయాడు. "ఇదంతా వద్దు ఆన్సర్" అంది సీరియస్ గా. "యా మీనా గారు " అని చెప్పాడు బాలు. ఆ మాటకు శ్రీముఖి పాలేరులైన హరి, అవినాష్ కలిసి స్టేజి మొత్తం బట్టలిప్పేసి పరిగెత్తారు. "మీనా - నేనా " అని అవినాష్ అనేసరికి మీనా నవ్వుతూ ఉంది. దాంతో శ్రీముఖి "బాగా నవ్వొస్తోంది కదా మీదా నీకు ఇలాంటి సందర్భంలో " అంది శ్రీముఖి.
![]() |
![]() |